దేశంలో త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా కేసులు

దేశవ్యా​ప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు నెలల కనిష్టానికి  కోవిడ్‌-19 కేసుల సంఖ్య చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,14,460 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్‌ కేసులు సంఖ్య 2,88,09,339 కి చేరింది. గత 24 గంటల్లో 2,677 మంది కరోనాతో మృతి చెందారు.