పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ముంబై పర్యటన సందర్భంగా జాతీయగీతాన్ని అగౌరవపరిచారని, ఈకేసులో మార్చి 2న జరిగే కోర్టు విచారణకు హాజరు కావాలని ముంబై కోర్టు ఆదేశించింది. ఈమేరకు బుధవారం పశ్చిమబెంగాల్ సీఎం మమతకు కోర్టు సమన్లు పంపించింది. గతేడాది డిసెంబర్లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మమతా బెనర్జీ ఆ కార్యక్రమం సందర్భగా జాతీయగీతాన్ని అగౌరవపరిచినట్లు, ఆ కేసులో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ నగరానికి చెందిన బీజేపీ విభాగం నేత వివేకానంద్ గుప్తా మాజ్గావ్లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు.
