9 ప్రైవేటు ఆసుపత్రుల యజమానులపై క్రిమినల్‌ కేసులు

కోవిడ్‌ చికిత్సలో అవకతవకలకు పాల్పడిన 9 ప్రైవేటు ఆసుపత్రుల యజమానులపై ఎపి సర్కార్‌ క్రిమినల్‌ కేసులను నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి 15 ఆసుపత్రులను తనిఖీ చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తాజాగా 9 ప్రైవేటు ఆసుపత్రులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది.  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ… అవకతవకలకు పాల్పడిన తొమ్మిది ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు. కోవిడ్‌ చికిత్సలో అవకతవకలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై ఏర్పాటు చేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బఅందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 37 ఆసుపత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.