పెరుగులో ఇది కలిపి రాసుకుంటున్నారా…

ఈ రోజుల్లో అమ్మాయి,అబ్బాయి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ దాని కోసం రకరకాల ప్రయత్నాలను చేస్తుంటారు. తరచ్చు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టిన ప్రయోజనం ఉండదు. అదే ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా చేసుకుంటే రెగ్యులర్ గా ఫాలో అయితే మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు చెప్పే చిట్కా ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలను కూడా తొలగిస్తుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ పాలు, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావు గంట అయ్యాక గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేయడంతో ముఖం మీద ఉన్న నల్లని మచ్చలు,మొటిమలు అన్ని తొలగిపోయి ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరుస్తుంది. ఓపికతో చేసుకుంటే ఇంటి చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.