రానా, శర్వానంద్ ల మల్టీస్టారర్

హీరో రానా దగ్గుబాటి ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్‌ సినిమాల పైన ఆసక్తి చూపిస్తున్నట్లు కనబడుతుంది. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్‌’ చిత్రంలో నటిస్తూనే… ఇప్పుడు నటుడు శర్వానంద్‌తో కలిసి మరో మల్టీస్టారర్‌ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలోని నటీనటులను త్వరలోనే వెల్లడించనున్నారు.