ఢిల్లీ హింస 42కి చేరిన మృతులు.. 630 మంది అరెస్ట్

ఢిల్లీ హింస: 42కి చేరిన మృతులు.. 630 మంది అరెస్ట్

ఈశాన్య ఢిల్లీలో అల్లర్లలో మృతుల సంఖ్య 42కి చేరింది. అల్లర్లో తీవ్రంగా గాయపడి గురు తేజ్‌బహదూర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నవారిలో మరో నలుగురు శుక్రవారం మృతిచెందారు. మరోవైపు, పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదటపడుతున్నాయి. శుక్రవారం పది గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. ముస్లింల ప్రార్థనలు కూడా ప్రశాంతంగా సాగాయి. పోలీసులు, పారా మిలటరీ దళాలు పరిస్థితి నిశితంగా గమనిస్తున్నాయి. ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఆప్ కౌన్సెలర్ తాహీర్ హుస్సేన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొబైల్ స్విచాఫ్ చేసిన తాహీర్.. ఆయన తరఫున మీడియా సమన్వకర్త కూడా తనతో టచ్‌లో లేరని తెలిపాడు. ఇప్పటి వరకు 123 ఎఫ్ఐఆర్‌లు నమోదుచేయగా, 630 మందిని అరెస్ట్ చేశారు.