ఢిల్లీలో మొదలైన ‘ఆప్’ దూకుడు.. 5 స్థానాల్లో ఆధిక్యం

ఢిల్లీలో మొదలైన ‘ఆప్’ దూకుడు.. 5 స్థానాల్లో ఆధిక్యం

న్యూఢిల్లీ, ఢిల్లీ ఉత్తర, దక్షిణ, సెంట్రల్, చాందినీ చౌక్‌ జిల్లాల్లో ఏకపక్ష విజయం దిశగా ఆమ్ అద్మీ పార్టీ కొనసాగుతుండగా, ఈశాన్య, వాయువ్య ఢిల్లీలో బీజేపీ సత్తా చాటుకుంటోంది. చాందినీ చౌక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి అల్కా లంబా వెనుకంజలో ఉన్నారు. వజీర్‌పూర్, బాబర్‌పూర్‌లో ఆప్ ముందంజలో ఉంది.

చాందినీ చౌక్‌లోని 10 స్థానాలకు గానూ 9 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. పత్పార్‌గంజ్‌లో డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, మాలవీయ నగర్‌లో ఆప్ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతి సమీప ప్రత్యర్థులపై ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ కంటోన్మెంట్, జనక్‌పురిలో బీజేపీ ముందంజలో ఉంది.

తొలి రౌండప్ కౌంటింగ్ పూర్తియ్యేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ 54 స్థానాలు, బీజేపీ 15 స్థానాలు, కాంగ్రెస్ ఒక్క చోట ఆధిక్యంలో ఉన్నారు. కాగా, మరోసారి ఈవీఎంల అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తుతోంది. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తోంది.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆ పార్టీ అభ్యర్థులు 50కిపైగా స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. అటు బీజేపీకి కూడా కొన్ని ప్రాంతాల్లో సత్తా చాటుతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీప ప్రత్యర్ధిపై ముందంజలో ఉన్నారు.