నిర్భయ దోషుల ఉరి ఎప్పుడు నేడు హైకోర్టు కీలక తీర్పు!

నిర్భయ దోషుల ఉరి ఎప్పుడు? నేడు హైకోర్టు కీలక తీర్పు!

నిర్భయ దోషులను ఉరి తీసేదెప్పుడు..? క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించిన ఇద్దర్నీ పక్కనబెట్టి మిగతా ఇద్దరు దోషులను ముందుగా ఉరి తీస్తారా? లేదంటే అందర్నీ కలిపి ఒకేసారి ఉరి తీస్తారా? ఈ ప్రశ్నలకు నేడు (బుధవారం) ఢిల్లీ హైకోర్టు తీర్పు రూపంలో సమాధానం లభించనుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నిర్భయ దోషులను ఉరి తీయొద్దని ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ… కేంద్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం హైకోర్టు విచారణకు చేపట్టనుంది.

నిర్భయ దోషుల్లో ఒకరు రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడంతో.. ఉరి శిక్ష అమలు వాయిదా వేయాలని మిగతా ముగ్గురు దోషులు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ముగ్గుర్ని ఉరి తీయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తిహార్ జైలు అధికారులు చెప్పగా.. జైలు నిబంధనల ప్రకారం ఓ కేసులో దోషులుగా తేలిన వారందర్నీ ఒకేసారి ఉరి తీయాలని దోషుల తరఫు లాయర్ వాదించారు.