నేడు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ..

దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర, సాధారణ బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల వల్ల ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్‌లో కోరారు. ఈడీ కస్టడీ ముగిసినందున సాధారణ బెయిల్ ఇవ్వాలని మరో పిటిషన్‌ను సైతం కవిత వేశారు.