‘ధమాకా’ పాట విడుదల

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ధమాకా’ ఒకటి. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ అందించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.