వైసీపీ గుర్తు ఎవరికీ తెలియదు..ఫ్యాన్‌ గుర్తును జనాల్లోకి తీసుకెళ్లాలి-ధర్మాన

వైసీపీ గుర్తు ఎవరికీ తెలియదు..ఫ్యాన్‌ గుర్తును జనాల్లోకి తీసుకెళ్లాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాధరావు. వైసీపీ గుర్తు ఏంటో ఇప్పటికి చాలా మందికి తెలియదు.. వైసీపీ గుర్తు ఏంటి అంటే సైకిల్, హస్తం అంటున్నారు.. ఫ్యాన్‌ గుర్తును జనాల్లోకి బాగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాద రావు.

ఇవాళ శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాధరావు మాట్లాడుతూ…ప్రజలు జగన్ కే ఓటు వేస్తామంటున్నారని… అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామని ప్రకటించారు. గెలవక ముందే పిటీషన్లు పెట్టి వాలంటీర్ వ్యస్దను తీయించారు….రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే పధకాలు అన్నీ తీసేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాధరావు.