దిల్ రాజు రెండో పెళ్లి వెనుక చక్రం తిప్పిన స్టార్ యాక్టర్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు పెళ్లి అంశం గత కొంతకాలంగా ట్రెండింగ్ అవుతోంది. మూడేళ్ల క్రితం ఆయన మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించాక ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నానట్లు కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో ఉన్న తన స్వగ్రామంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రెండో వివాహం చేసుకున్నారు దిల్ రాజు.

తమ బంధు వర్గానికి చెందిన తేజస్విని అనే అమ్మాయి మెడలో మూడుముళ్ళేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి తర్వాత ఆమె పేరును వైఘా రెడ్డిగా మార్చినట్లు సమాచారం. ఈ క్రమంలో దిల్ రాజు పెళ్లి టాపిక్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. 49 ఏళ్ళ వయసున్న దిల్ రాజు ఈ వయసులో రెండో పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? ఈ పెళ్ళికి సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరి సహకారం ఉంది? అనే కోణంలో విశ్లేషణలు ప్రారంభించారు జనం.

ఈ క్రమంలోనే తాజాగా స్టార్ యాక్టర్ ప్రకాష్ రాజ్ పేరును బయటపెడుతూ కొన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి రెండో పెళ్ళి చేసుకోవాలని, జీవితంలో ఓ తోడు ఉంటేనే విజయ తీరాలకు అలవోకగా చేరుకోగలమని ఆయన దిల్ రాజుతో చెప్పారట. ఎలాగైనా రెండో పెళ్లి చేసుకోవాల్సిందే అని ప్రకాష్ రాజ్ ఫోర్స్ చేయడం వల్లనే దిల్ రాజు ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది. మరోవైపు దిల్ రాజు పెళ్ళికి ఆయన కుటుంబ సభ్యులు, ఆప్తులు, ముఖ్యంగా కూతురు హన్షిత రెడ్డి ప్రోత్సాహం ఎక్కువగా ఉందని తెలిసింది. ఏదేమైనా దిల్ రాజు రెండో పెళ్లి విషయం మాత్రం జానాలకు ఆసక్తికర అంశం అయింది.