రామ్‌చరణ్‌, యశ్‌తో శంకర్‌ మల్టీస్టారర్‌!

శంకర్‌ సినిమాలు భారీగా ఉంటాయి. భారీ గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్‌ ఆయన స్పెషాలిటీ. ప్రస్తుతం ‘ఇండియన్‌’ సీక్వెల్‌ ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. ఈ సినిమా తర్వాత శంకర్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సూపర్‌స్టార్‌ రామ్‌చరణ్, కన్నడ స్టార్‌ హీరో యశ్‌ను హీరోలుగా పెట్టి ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం కోలీవుడ్‌ సర్కిల్స్‌లో ఇదే హాట్‌ టాపిక్‌.