నిర్మాతగా మహేష్ బాబు, హీరోగా రామ్ చరణ్

మాంచి సక్సెస్ మీద ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లి…. ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన మహర్షి చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో మనందరికీ తెలిసిందే. అయితే వంశీ పైడిపల్లి మేకింగ్ నచ్చిన మహేష్ బాబు ఆయనతో మరొక సినిమా చేయాలనీ అనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ చిత్రం తెరకెక్కలేదు. దీంతో దర్శకుడు పరశురామ్ వైపు మొగ్గు చూపించాడు మహేష్ బాబు. కానీ వంశీ పైడిపల్లి తన కోసం సిద్ధం చేసిన కథను కూడా తెరకెక్కించడానికి నిర్ణయించుకున్నారు మహేష్ బాబు. కానీ ఆ చిత్రానికి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

అయితే వంశీ పైడిపల్లి తనకోసమని సిద్ధం చేసిన కథకి రామ్ చరణ్ అయితే సరిగ్గా సెట్ అవుతాడనీ, ఆయనను ఒప్పిస్తే తాను నిర్మిస్తానని వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు అన్నాడట. అయితే వంశీ తో ఉన్న సాన్నిహత్యం కారణంగా రామ్ చరణ్ కూడా ఒప్పేసుకున్నాడని సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి రామ్ చరణ్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు.