ఈ టీ తాగడంతో శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంచవచ్చు..

మనం ఎక్కువగా వినియోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. శీతాకాలంలో చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ముఖ్యంగా చాలామంది జలుబు దగ్గు సమస్యల బారిన పడుతుంటారు. మరి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ లవంగాల టీని తాగడంతో …..ఇందులో ఉండే సుగుణాలు గొంతునొప్పి, కఫం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలా మందిలో వాతావరణంలోని మార్పుల కారణంగా శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. దీంతో జ్వరం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా లవంగాల టీని తాగాల్సి ఉంటుంది.


శీతాకాలంలో చాలామందిని వేధించే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి.. ఈ దగ్గు కారణంగా కొంతమంది ఊపిరితిత్తుల సమస్యల బారిన కూడా పడుతున్నారు. ఇలాంటి వారు లవంగాల టీని తాగడంతో ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరంలో కఫాన్ని తొలగించేందుకు కూడా సహాయపడతాయి.


చలి కాలంలో చాలామందిని వేధించే సమస్య జీర్ణ క్రియ మందగించడం. అయితే దీనికి కారణంగా చాలామందిలో మలబద్ధకం, గ్యాస్‌ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తీసుకోండి.