బరువు తగ్గాలా.. అయితే స్ట్రాబెరీస్ తినండి..

బరువు తగ్గాలా.. అయితే స్ట్రాబెరీస్ తినండి..

స్ట్రాబెరీస్ చూడ్డానికి ఎర్రగా.. లవ్ సింబల్‌లా ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. వీటిని చాలా మంది మిగతా పండ్ల కంటే తక్కువ మోతాదులో తీసుకుంటారు. వీటిని ఎక్కువగా ఫ్రూట్ సలాడ్స్, ఐస్ క్రీమ్స్‌లో వాడతారు. కొంతమంది వీటిని జ్యూస్ రూపంలో తీసుకుంటుంటారు.

అధిక బరువుతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యని తగ్గించుకునేందుకు ఎంతగానో కష్టపడతారు. రకరకాల వర్కౌట్స్ చేస్తుంటారు. డైట్ పాటిస్తుంటారు. ఎన్నో వ్యయప్రయాసలు పడుతుంటారు. ఇవన్నీ పాటించినా అనుకున్న ఫలితాలు రావు. అయితే, కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది.