గుడ్డు తింటే బరువు పెరుగుతారా..

గుడ్డు తింటే బరువు పెరుగుతారా..!

ప్రస్తుత కాలంలో అనేక మంది ఎదుర్కుంటున్న సమస్యల్లో అధిక బరువు పెరగడం ఒకటి. ఆహారపు అలవాట్లు మరియు అనారోగ్యకరమైన జీవన శైలి కూడా ఇందుకు కారణం కావచ్చు. అయితే చాలా మంది బరువు తగ్గేందుకు అనేక చిట్కాలు పాటిస్తారు కానీ అంట త్వరగా బరువు తగ్గరు అందుకు కారణం ఆహారపు అలవాట్లు. ప్రస్తుతం కాలంలో యువత ఎక్కువగా బయట తినటానికి ఇష్టపడతారు. కానీ హోటల్లో వాడే హానీకరమైన పదార్ధాల వల్ల బరువు పెరగటమే కాక, అనేక అనారోగ్యాలకు గురౌతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా యువతరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది.

గుడ్డులో అధిక కొలెస్టరాల్ ఉంటుందని ఇది తింటే అధిక బరువు పెరుగుతారని అనేక మంది భావిస్తారు. అయితే గుడ్డు తినడం వల్ల బరువు తగ్గుతారని మనలో చాలా మందికి తెలీదు. పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల చాలా మంది మొత్తం గుడ్డు తినరు. దీన్ని అనారోగ్యాంగా భావిస్తారు. మొత్తం గుడ్డులోని కేలరీలలో 62 శాతం కొవ్వు నుండి వస్తుంది. కానీ మీ ఆహారం నుండి గుడ్డు పచ్చసొనను నివారించడానికి ఈ కారణం సరిపోతుంది. కొవ్వుతో పాటు, పచ్చసొనలో ఐరన్, విటమిన్ బి 2, బి 12 మరియు డి వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి, ఇవి గుడ్డులోని తెల్లసొనలో లభించవు. మీరు గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తీసుకుంటే, మీ శరీరానికి అవసరమైన ఇతర పోషకాలను మీరు కోల్పోతారు. గుడ్లు బరువు తగ్గడానికి స్నేహపూర్వక ఆహారం. వీటిలో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.