బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారా..

అధికబరువు అందరికీ సమస్యే. ఈ సమస్యని తగ్గించుకోవాలని ఎన్నో విధాలు ప్రయత్నిస్తారు అనేకమంది. అయితే, ఇది మామూలు సమయాల్లో కొంచెం ఈజీ.. ఎందుకంటే ఇతర పనులు ఉంటాయి. అదే లాక్‌డౌన్ టైమ్‌లో అంటే మాత్రం కాస్తా కష్టమే.. మరి ఇలాంటి టైమ్‌లోనూ ఈజీగా బరువు ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి..లాక్ డౌన్ మూలంగా బైటికి వెళ్ళలేకపోతున్నారనీ, అందువల్ల ఎటువంటి వ్యాయాయం లేక బాగా బరువు పెరిగిపోతున్నారనీ కొంతమంది అనుకుంటున్నారు.

మీరు నిద్ర లేవగానే ఒక లీటర్ నీళ్ళు తాగి, మూడు బాటిల్స్ నిండా నీళ్ళు నింపి మీ కంప్యూటర్/లాప్ టాప్ పక్కనే పెట్టుకోండి. ఒక దానిలో కొంచెం పుదీనా గానీ, నిమ్మరసం, కొంచెం ఉప్పు కలుపుకోండి. సాయంత్రం ఏడయ్యేటప్పటికి ఈ మూడు లీటర్ల నీళ్ళూ తాగుతూ ఉండండి.. ఇలా చేయడం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. బరువు తగ్గడానికి బావుంటుంది.

నిజానికీ.. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ బరువు తగ్గిస్తుందని చెబుతారు. కానీ, నేటి లాక్‌డౌన్ టైమ్‌లో దీనిని స్కిప్ చేస్తే చక్కని ఫలితాలు ఉన్నాయని కొంతమంది ఆచరించిన వారు చెబుతున్నారు. అయితే, ఆ టైమ్‌లో కడుపుని ఖాళీగా ఉంచకూడదు. ఉదయాన్నే నీళ్ళు దీంతో పాటు కొన్ని నానబెట్టిన బాదంలు, ఓ గుడ్డు తినాలి.. ఇది బ్రేక్‌ఫాస్ట్ కంటే ఎక్కువగా ఎఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేసే డైట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటారు. మరీ ఆకలిగా అనిపిస్తే మాత్రం పంచదారు లేకుండా బ్లాక్ కాఫీ తాగొచ్చు. మొదట్లో ఇది కాస్తా కష్టంగా ఉంటుంది. రాను రాను అలవాటు అవుతుంది.

అవును నిజమే, సరైన నిద్ర కూడా బరువు తగ్గడానికి అవసరమే. మీ పడకగది చీకటిగా, చల్లగా ఉండేటట్లు చూస్కోండి. అప్పుడే మీరు హాయిగా నిద్రపోగలుగుతారు. నిద్రలేమి మిమ్మల్ని రోజంతా చిరాకుగా ఉంచడమే కాదు మీ బరువు పెరగడానికి కూడా దోహదం చేస్తుంది. కాబట్టి.. చక్కగా నిద్రపోండి.. బరువు తగ్గండి.. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు.