రోజుకి పావుగంట ఇలా చేస్తే చాలు.. ఒత్తిడి దూరం..

రోజుకి పావుగంట ఇలా చేస్తే చాలు.. ఒత్తిడి దూరం..

డిప్రెషన్.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినే పదాల్లో ఇది ఒకటి. దీని వల్ల జరిగే నష్టాలు చాలానే ఉన్నాయి. అందులో నిద్రలేమి, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఇది ఎంత వరకూ దారి తీస్తాయంటే చివరికీ ప్రాణాలు తీసుకునే వరకూ కూడా ఈ సమస్య దారితీస్తుంది. కానీ, ఈ సమస్యకి ఎండలో కూర్చోవడం వల్ల పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ఎండ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, మనం కాస్తా ఎండ తగలగానే అమ్మో అని అంటుంటాం. ఎండలో ఉండడం ప్రతి మానవునికి చాలా అవసరం. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. మానవుల్లో ఎముకల బలానికి డి విటమిన్ చాలా అవసరం. దీని వల్ల కండరాల కూడా బలంగా మారతాయి. డి విటమిన్ లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కచ్చితంగా అందరూ కాసేపైనా ఎండని ఆస్వాదించాల్సిందే. అలా కాకుండా చాలా మంది ఈ సమస్య పరిష్కారానికి మందులపై ఆధారపడుతుంటారు. అలాంటివారంతా మనకి ప్రకృతి నుంచి ఫ్రీగా లభించే ఎండలో ఉండండని చెబుతున్నారు నిపుణులు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.