బ్రెయిన్ షార్ప్‌గా చేసే బెస్ట్ డ్రింక్ ఇదే..

బ్రెయిన్ షార్ప్‌గా చేసే బెస్ట్ డ్రింక్ ఇదే..!

ఉదయాన్నే లేచిన వెంటనే రోజును ఒక కప్పు టీ తో ప్రారంభిస్తాం. దీంతో బద్దకం వదిలి పనులను హుషారుగా చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. టీ తాగటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. టీలో అనేక రకాలు ఉన్నాయి. అయితే టీ తాగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తాజాగా కొన్ని అధ్యయనాలు టీ తాగడం వల్ల బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుందని చెబుతున్నారు.

టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పటివరకూ అనేక అధ్యయనాలు కొనసాగాయి.. టీ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలను ఎప్పటికప్పుడు వివరిస్తూనే చెబుతూనే ఉన్నారు. అయితే, ఇటీవల తాజాగా ఓ కొత్త అధ్యయనం నిర్వహించారు. ఇందులో కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు తెలిశాయి. అవేంటంటే.. టీ తాగడం వల్ల బ్రెయిన్‌కి ఎలాంటి లాభాలు ఉన్నాయి. దీంతో.. మెదడుకి కలిగే ప్రయోజనాలు తెలుసుకునేందుకు అధ్యయనాలు కొనసాగాయి.. ఇందులో రెగ్యులర్‌గా టీ తాగటం వల్ల అది మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుందని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో టీ ఒకటి. టీలో అనేక రకాలు, తయారీ విధానాలు వేరైనప్పటికీ టీ అందరి ఆదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మంది టీ ప్రేమికులే. టీ తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అనేక అధ్యయాలు తెలిపాయి. కొన్ని అధ్యయనాలు టీ తాగడం మెదడుకు ఎంతో మేలు చేస్తాయని తెలిపాయి. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో టీ తాగటం వల్ల మెదడుకు కలిగే ప్రయోజనాలను వివరించారు. మెదడు యొక్క నిర్మాణంపై టీ ప్రభావాన్ని ప్రత్యేకంగా గమనించారు. రోజు టీ తాగేవారికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఈ అధ్యాయనం రుజువు చేసింది. రెగ్యులర్ టీ తాగనివారికంటే, తాగేవారికి మెరుగైన మెదడు నిర్మాణాన్ని కలిగి ఉంటారని తేల్చింది. టీ తాగడం వల్ల మెదడులో ఎక్కువ క్రియాత్మక మరియు నిర్మాణాత్మక అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంది .