రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘నేడు బాబా సాహెబ్ వర్ధంతి. ఆయన భావాలకు ఏనాటికీ మరణం లేదు. గత 100 సంవత్సరాలుగా భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ అంశాల మీద ఆయన ముద్ర చెక్కుచెదరలేదు. సామాజిక న్యాయంతో కూడిన స్వాతంత్య్రం, సమానత్వాలకు ఆయన చెప్పిన అర్థం ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో మనసా వాచా కర్మణా సాకారమవుతోంది’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
