రోజూ ఓ జామపండు తింటే క్యాన్సర్ రాదట..

రోజూ ఓ జామపండు తింటే క్యాన్సర్ రాదట..

జామపండులో అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల గ్యాస్ట్రిక్, అసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. అదే విధంగా తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. జామచెట్టు బెరడుతో కాసిన డికాషన్ తాగడం వల్ల పొట్టోని నులిపురుగులు, ఇతర సూక్ష్మజీవులు నశిస్తాయి. తరచూ జామకాయ తినేవారిలో మలబద్ధక సమస్య దరిచేరదు. కాబట్టి.. బాగా పండిన జామ పండ్ల ముక్కలపై మిరియాల పొడి చల్లి.. కొద్దిగా నిమ్మరసం చల్లుకుని తింటే ఎంతటి మలబద్ధక సమస్య అయినా దూరం అవ్వాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. దీంతో పాటు అతిసార, విరేచనాలు దూరం అవుతాయి..

జామ తినడం వల్ల క్షయ, ఉబ్బసం, బ్రాంకైటీస్, గుండె బలహీనత, కామెర్లు, హైపటైటీస్, జీర్ణాశయపు అల్సర్లు, మూత్రంలో మంట వంటి సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు… బాగా పండిన జామ పండు తినడం వల్ల అందులోని గుజ్జు ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అదే విధంగా కాలిన గాయాలతో బాధపడేవారు.. గుజ్జును ఆ ప్రాంతంలో రాయడం వల్ల సమస్య దూరం అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

రోజూ జామండు తినడం వల్ల షుగర్ వంటి సమస్యలు కూడా త్వరగా తగ్గిపోతాయని చెబుతున్నారు నిపుణులు. ఈ జామపండు గుజ్జు.. అనేక సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు.