కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే జట్టు రాలడం తగ్గి.. బాగా పెరుగుతుంది..

హెయిర్ ఫాల్ సమస్య ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. మనలో చాలామంది ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. అనేక రెమెడీస్ ను ట్రై చేస్తాం. అలాగే వివిధ ఖరీదైన హెయిర్ ప్యాక్స్ ను పాటిస్తాం. హెయిర్ ఫాల్ ను ట్రీట్ చేయడానికి పోషకవిలువలున్న ఆహారం హెల్ప్ చేస్తుందన్న విషయం వాస్తవమే. ఐతే, కొన్ని సార్లు ఈ ఇష్యూ అనేది కుదుళ్ళ నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ గా ఉండేలా కేర్ తీసుకోవాలి. అందుకు ముఖ్యమైన విధానం ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్ ను అప్లై చేయడం. ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెమెడీ మీకు ఎంతో హెల్ప్ చేస్తాయి.

కావలసిన పదార్థాలు:

  • కొబ్బరినూనె – 2 కప్పులు
  • నువ్వుల నూనె – 1/2 కప్పు
  • క్యాస్టర్ ఆయిల్ – 1/2 కప్పు
  • గుప్పెడు కరివేపాకు
  • ఆమ్లాను కూడా కలపొచ్చు
  • 1 టేబుల్ – మెంతి గింజలు
  • మందార పూలు – 3 నుంచి నాలుగు
  • మందారాకులు – గుప్పెడు

తయారుచేసే విధానం:

1. ఈ పదార్థాలన్నిటినీ బాగా కలిపి ఈ మిశ్రమం డార్క్ కలర్ లోకి మారేవరకూ బాయిల్ చేయండి.

2. స్టవ్ ను ఆఫ్ చేసేయండి.

3. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఆ తరువాత గ్లాస్ కంటైనర్ లోకి తీసుకోండి.

అప్లై చేసే విధానం

ఈ ఆయిల్ ను వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు. రోజూ అప్లై చేసుకున్నా పరవాలేదు.

హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టే ఈ పదార్థాల పవర్ ను ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొబ్బరి నూనె:

అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ కు ఒకే ఒక్క సొల్యూషన్ కొబ్బరి నూనె అని చెప్పుకోవచ్చు. జుట్టు పలచనవడం, హెయిర్ ఫాల్ అలాగే డ్రై స్కాల్ప్, ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం మాత్రం కొబ్బరి నూనె అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ కు వన్ స్టాప్ సొల్యూషన్ కావచ్చు. కానీ, హెయిర్ ఫాల్ ను తగ్గించడంలో మాత్రం ఇది ఎంతో ప్రత్యేకం. కొబ్బరి నూనె హెయిర్ ఫాల్ ను నిరోధించి హెయిర్ గ్రోత్ హెల్తీగా ఉండేందుకు సపోర్ట్ చేస్తుంది. కొబ్బరి నూనె శరీరం ఉత్పత్తి చేసే నూనెలలాగానే ఉంటుంది. నేచురల్ ఆయిల్ లాగానే స్కాల్ప్ ను పొడిబారకుండా చేస్తుంది. హెయిర్ రూట్స్ ను డేమేజ్ నుంచి రక్షిస్తుంది.

2. నువ్వుల నూనె:

రీసెంట్ స్టడీస్ ప్రకారం హెయిర్ ఫాల్ కు నువ్వులనూనె ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది. బట్టతలను ప్రివెంట్ చేసే మినాక్సిడిల్ వంటి మెడిసిన్స్ తో సరిసమానంగా నువ్వులనూనె పనిచేస్తుంది. హెయిర్ ను నువ్వుల నూనెతో మసాజ్ చేస్తే బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో, హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. ఇంకా ఈ నూనె రిలాక్సింగ్ ఆయిల్ లా పనిచేస్తుంది. కాబట్టి, నువ్వులనూనెతో తలను మసాజ్ చేస్తే యాంగ్జైటీ వంటి సమస్యలు తగ్గుతాయి. వాటితో అనుసంధానమై ఉన్న హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మైగ్రైన్ అలాగే ఇన్సోమ్నియాకు ఇది మంచి రెమెడీ.