కల్కి 2898AD లో మరో సీనియర్ నటుడు..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందులున్న కల్కి 2898ADతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 9 గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు.
ఇక ఈ సినిమా మహాభారతం నుంచి మొదలయి కలియుగం 2898లో ముగుస్తుందని, 6000 సంవత్సరాల కథని చూపించబోతున్నట్టు, భవిష్యత్తు, గతం.. సైన్స్, పురాణాలు.. ఇలా అన్ని కలిపి చూపించబోతున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పి ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచారు. కల్కి గురించి రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారని సమాచారం. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో సీనియర్ నటుడు తోడయ్యారు .

ఇప్పటికే కల్కి సినిమాలో కమల్‌ హాసన్‌ విల‌న్‌గా కనిపించనున్నాడని, దీపికా పదుకొనే, దిశా పటాని, రానా, అమితాబ్ బచ్చన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని అధికారికంగానే ప్రకటించారు. వీళ్ళే కాకుండా రాజమౌళి, దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ.. కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. ఇటీవల తెలుగు సినిమాల గొప్పదనం గురించి మాట్లాడుతూ త్వరలో రాబోయే భారీ సినిమా కల్కిలో కూడా నటించాను అని తెలిపారు. దీంతో రాజేంద్రప్రసాద్ కూడా కల్కి సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించారని తెలుస్తుంది.