మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అస్వస్థత

ఈటల రాజేందర్ ప్రజాదీవెన యాత్రకు తాత్కాలిక విరామం వచ్చింది. పాద యాత్ర 12వ రోజులలో భాగంగా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకున్న ఈటల అస్వస్థతకు గురవ్వడం నడవలేని స్థితిలో ఉండడంతో పాదయాత్రను కొండపాక లో నిలిపివేశారు. ఈటలకు వైద్యుల పరీక్షల్లో బీపీ 90/60, సుగర్ లెవెల్ 265 గా నమోదయ్యింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో వెంటనే పాదయాత్రను నిలిపి వేశారు. ఉన్నత వైద్యం కోసం ఈటలను హైదరాబాద్ తరలించాలని డాక్టర్స్ సలహా ఇచ్చారు. దాంతో ఈటల ను హైదరాబాద్ కి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక బీజేపీ నేతలు. ఈ నెల 19వ తేదీన ప్రారంభించబడిన ప్రజా దీవెన యాత్ర ఈరోజుతో 12 వ రోజుకి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు 70 గ్రామాల్లో 222 కిలోమీటర్లు పూర్తి చేసారు ఈటల.