“F3” ఫన్ స్టార్ట్..స్పెషల్ లుక్ లో వెంకటేష్

 విక్టరీ వెంకటేష్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలుపుతూ “ఎఫ్ 3” మేకర్స్ సరికొత్త వీడియోను విడుదల చేశారు. వెంకటేష్ తన చుట్టూ ఉన్న వ్యక్తులతో చార్మినార్ ముందు విశ్రాంతి తీసుకుంటూ కనిపించడంతో రాజులా రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ సంస్కృతిని కన్విన్సింగ్‌గా ప్రదర్శించారు. స్పష్టంగా చిత్రంలోని ఒక పాట నుండి ఈ వీడియో క్లిప్ ను విడుదల చేసినట్టు కన్పిస్తోంది. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “ఎఫ్ 3” చిత్రం నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేశారు. మేకర్స్ వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రిలీజ్ చేసిన ఈ ప్రత్యేక వీడియోలో వెంకటేష్‌ని నిజామీ గెటప్‌లో చార్మినార్ బ్యాక్‌డ్రాప్‌లో కూర్చోని, డబ్బును చూపిస్తూ సంతోషంగా కనిపిస్తున్నాడు.