దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు : కొడాలి నాని

దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు అంటూ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన గుడివాడ 12వ వార్డులో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు జీవితంలో ఏనాడైనా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. కనీసం సర్పంచ్‌తో కూడా రాజీనామా చేయించలేని వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు.అవతలవారికి చెప్పే ముందు.. నీ దగ్గరున్న  23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో రాజీనామా చేయించాలని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజీనామాలను ఈక ముక్కతో సమానంగా విసిరేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌. ఎన్నికలంటే పారిపోయే వ్యక్తి చంద్రబాబు. వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టినపుడు ఎంపీ పదవికి రాజీనామా చేశారని, 18 మందితో రాజీనామా చేయించి.. 15 మందిని గెలిపించుకున్న వ్యక్తి జగన్‌ అని కొడాలి నాని గుర్తు చేశారు.…