జులై 15 నుండి అందరికీ ఉచితంగా బూస్టర్ డోసు

శవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆజాదీకా అమృత్‌ మహాత్సవ్‌’లో భాగంగా బూస్టర్ డోస్ (ప్రీకాషన్ డోస్)   పంపిణీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 18 నుండి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.