థియేటర్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న‌ప్రేక్ష‌కులు అంద‌రు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించబోతున్నాడు జక్కన్న. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది. కానీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు.. కొన్ని అనుకోని కారణాల వలన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వాయిదా వేశారు.