26న ‘గీత’ విడుదల

హెబ్బా పటేల్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గీత’ చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ‘గ్రాండ్‌ మూవీస్‌’ పతాకంపై ఆర్‌.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్‌ శిష్యుడు విశ్వా.ఆర్‌.రావు దర్శకత్వం వహిస్తున్నారు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’ చిత్రాల ఫేమ్‌ సాయి కిరణ్‌ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. రామ్‌ కార్తిక్‌, సప్తగిరి, రాజీవ్‌ కనకాల, పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సుభాష్‌ ఆనంద్‌ సంగీతం అందిస్తున్నారు.