అల్లం తో షుగర్ కు చెక్.. ఎలా అంటే..?

ప్రస్తుతం చాలా మంది షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారు. మన ఆహారపు అలవాట్లు జీవన సైలి ఈ సమస్యకు కారణం అవుతోంది . ఇక డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్య పరం గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే కొంత మంది మందులు వాడినప్పటికీ డయాబెటిస్ అదుపులో లేకుండా పోతుంది. కానీ అల్లంతో డయాబెటిస్ కు కాస్త చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు .

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక షుగర్ ఉన్నవారు అల్లం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారికి రోజూ 4 గ్రాముల అల్లాన్ని ఇచ్చి చూడడం వల్ల వారిలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని అల్లాన్ని వాడడం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడంతో పాటు మనం అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు అని నిపుణులు తెలిపారు