చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ టీజర్‌ విడుదల

‘ 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. సడెన్‌గా తిరిగొచ్చిన 6 ఏళ్లల్లో జనంలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక్కడికి ఎవ్వరొచ్చిన రాకపోయినా నేను పట్టించుకోనూ.. కానీ అతను రాకూడదు. హి ఈజ్‌ రీజన్‌ ఫర్‌ ఎవ్రీగాన్‌ థింగ్‌, కిల్‌ హిమ్‌’ అంటూ అతడి గురించే మాట్లాడుకుంటారు. ఆయనే గాడ్‌ ఫాదర్‌. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ ఈ టీజర్‌ను విడుదల చేసింది. గాడ్‌ ఫాదర్‌ అని ఎందుకంటున్నారో తెలియాలంటే.. దసరా వరకు వేచి చూడాల్సిందే. చిరంజీవి రఫ్‌లుక్‌లో కనివిందు చేశారు. సల్మాన్‌, నయనతార, సత్యదేవ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌, చిరంజీవి కనిపించడంతో అభిమానులు ఆనంద ఢోలికల్లో తేలియాడుతున్నారు. తమన్‌ సంగీతం అందిస్తుండగా.. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.