ఏపీ ప్రజలకు గవర్నర్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 73 వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన రిపబ్లిక్‌ వేడుకల్లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, సిఎం జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసు దళాల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు. జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన జరిగింది. మొత్తం 16 శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ … రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు’ అమలు చేస్తోందని చెప్పారు.