మేడారంలో భారీ వర్షం.. కరుణించిన అమ్మలు

మేడారంలో భారీ వర్షం.. కరుణించిన అమ్మలు

మేడారంలో జాతర ముగింపు వేళ భారీ వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా పలువురు భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాన్ని అమ్మవార్ల దీవెనలుగా పలువురు భక్తులు అభివర్ణిస్తున్నారు. అయితే.. జాతర సందర్భంగా విక్రయించడానికి సిద్ధం చేసుకున్న వస్తువులు, ఆహార పదార్థాలు తదితరాలు తడిసి ముద్దవడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో నేలంతా చిత్తడిగా మారింది. మరోవైపు.. జంపన్నవాగు వద్ద పలువురు భక్తులు వర్షంలో ఆహ్లాదంగా గడపడం కనిపించింది.