హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎస్సాఆర్‌‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి