ఈ చెట్లు ఒత్తిడిని తగ్గిస్తాయని మీకు తెలుసా..

ఈ చెట్లు ఒత్తిడిని తగ్గిస్తాయని మీకు తెలుసా..?

ఆఫీస్ జాబ్స్ అంటేనే ఒత్తిడికి కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉంటాయి. ఎక్కువసేపు, ఒకేచోట కూర్చోవడం, స్క్రీన్ చూడడం వంటివి తెలియకుండానే మనలో ఒత్తిడి, ఆందోళనలను పెంచుతూ ఉంటాయి. అంతేకాకుండా, ఇవి జీవక్రియల మీద కూడా తీవ్ర ప్రభావాలను చూపుతుంటాయి. క్రమంగా హార్మోన్స్‌ సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఎక్కువగా డెస్క్ జాబ్స్ చేసేవారు, అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారని నివేదికలు కూడా చెబుతున్నాయి. ఈ డెస్క్ జాబ్స్, మెదడులో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్స్‌ని పెంచుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనలకు దారి తీస్తాయి. ఇంటీరియర్ ప్లాంట్స్ డెస్క్ మీద ఉంచడం ద్వారా, ఇటువంటి ఒత్తిళ్ళు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.