‘రాజా విక్రమార్క’ పోస్టర్‌ విడుదల

Rx100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. ”హిప్పీ, గుణ 369, 90 ML, చావు కబురు చల్లగా” లాంటి సినిమాలతో అలరించిన ఈ హీరో ఇప్పుడు చిరంజీవి టైటిల్‌తో మరోసారి థియేటర్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘రాజావిక్రమార్క’ పేరుతో కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా బక్రీద్ కానుకగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ముస్లిం వేషధారణలో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు కార్తికేయ. డిఫరెంట్ స్టోరీలైన్‌తో రాబోతున్న ఈ మూవీని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ ఫస్ట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండగా రామారెడ్డి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.