మాట తప్పిన మంచు మనోజ్.. నెటిజన్ నిలదీతకు క్షమాపణలు

మాట తప్పిన మంచు మనోజ్.. నెటిజన్ నిలదీతకు క్షమాపణలు

మంచు వారి చిన్నబ్బాయి మంచు మనోజ్ నెటిజన్‌కి సారి చెప్పాడు.. ఇచ్చిన మాట తప్పడంతో నిలదీసిన నెటిజన్‌కు సారీ చెప్పలేదు. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. మంచు మనోజ్ సోషల్ మీడియా యమా యాక్టివ్‌గా ఉంటాడు. మనోడికి సినిమా అప్డేట్స్ ఏం లేకపోవడంతో పర్శనల్ విషయాలను షేర్ చేస్తూ.. అప్పుడప్పుడూ ఇతర హీరోల సినిమాలపై కూడా స్పందనలు తెలియజేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నాడు.

అయితే మంచు మనోజ్ జనవరి 28న ఈ వారంలో ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పి రెండు వారాలపైనే అయ్యింది.. ఇంకా అప్డేట్ రాకపోవడంతో మంచు మనోజ్‌ని ట్యాగ్ చేస్తూ.. ‘వీక్ టైం అంటే 20 లేదా 30 వీక్స్ తరువాతనా అన్నా.. త్వరగా చెప్పు అన్నా’ అని ఓ నెటిజన్ నిలదీయడంతో మంచు మనోజ్ లైన్ లోకి వచ్చాడు.