రెండు పార్ట్‌లుగా రాబోతున్న సలార్‌

ప్రభాస్‌ హీరోగా పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ సలార్‌. ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్‌ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ‘బాహుబలి’, ‘పుష్ప’ వంటి చిత్రాల మాదిరిగా సలార్‌ కూడా రెండు పార్ట్‌లుగా రాబోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించడానికే మూవీ మేకర్స్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు చిత్రయూనిట్‌ స్పందించలేదు. అధికారకంగా ప్రకటించనూలేదు. త్వరలోనే చిత్రయూనిట్‌ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుందని సమాచారం. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్‌ బ్యానర్‌పై విజరు కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ, భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి హిందీ, తమిళం, మలయాళం భాషల్లోకి డబ్‌ చేయనున్నారు.