తండ్రి కాబోతున్న హీరో ఆది పినిశెట్టి..

నటి నిక్కీ మలయాళ, తమిళ, కన్నడ వంటి భాషల్లో పలు చిత్రాలు చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. తర్వాల తెలుగులో కృష్ణాష్టమితో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరో ఆది పినిశెట్టితో మలుపు, మరకతమణి సినిమాలు చేసి ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వీరిద్దరు 2022లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో పెళ్లి తర్వాత నిక్కీ పూర్తిగా సినిమాలకు దూరమైంది.

ఇక ఆది మాత్రం విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా, నిక్కీ తల్లి కాబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం తన ఇన్‌స్టాగ్రామ్ నిక్కీ తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసింది. అయితే ఆ ఫోటోని చూసిన అభిమానులు నిక్కీ ప్రెగ్నెంట్ అందుకే ఈ ఫొటోలు షేర్ చేసి హింట్ ఇచ్చిందని చర్చించుకుంటున్నారు. కొందరైతే ఏకంగా వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ నిక్కీ ప్రెగ్నెంట్ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.