ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

వైసీపీకి ఏపీ హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో రోజా, విడదల రజని, మధుసూదన్ రెడ్డి, సంజీవయ్య, వెంకట గౌడ్ లు ఉన్నారు.

కరోనా వ్యాప్తికి వైసీపీ ఎమ్మెల్యే నేతలే కారణమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇంద్రనీల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. అనంతరం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించారు.