హిట్ సినిమా రివ్యూ

హిట్ సినిమా రివ్యూ

“ఫలక్ నామా దాస్” సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజీ హీరోగా మారిపోయిన విశ్వక్ సేన్ హీరోగా రుహాని శర్మ హీరోయిన్ గా శైలేష్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్”. యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విశ్వక్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.మరి తాను చెప్పినట్టుగా ఈ సినిమా సీట్ ఎడ్జింగ్ రేంజ్ లో ఉందా లేదా అన్నది ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే విక్రమ్ రుద్రరాజు(విశ్వక్ సేన్) ప్యానిక్ అటాక్ డిజార్డర్ తో బాధపడే ఓ క్రైమ్ ఆఫీసర్.అయితే అనుకోకుండా తాను ప్రేమించిన అమ్మాయి రుహాని శర్మ మిస్సయిపోతుంది.అలాగే మరోపక్క ప్రీతీ అనే అమ్మాయి కూడా మిస్సవుతుంది.రెండు ఛాలెంజింగ్ కేసులు.వీటి వెనుక ఉన్నది ఎవరు?విక్రమ్ రుద్రరాజు రెండు కేసులను ఛేదించాడా లేదా..?విక్రమ్ గత జీవితం ఏమిటి?అసలు ఈ సినిమాకు ఎండింగ్ ఎలా పడింది?అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే ఈ చిత్రాన్ని మీ దగ్గర ఉన్న థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :

మొదటగా హీరో విశ్వక్ సేన్ కోసమే మాట్లాడుకోవాలి ఈ సినిమాపై విశ్వక్ పెట్టుకున్న అపారమైన నమ్మకం ఫస్ట్ హాఫ్ తోనే నిజం చేసుకున్నారని చెప్పాలి.తాను చెప్పినట్టుగానే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది.ఎడ్జింగ్ లో కూర్చోబెట్టే ఆసక్తికర సన్నివేశాలు ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇలాంటి థ్రిల్లింగ్ జాన్రా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను మరింత థ్రిల్ చేస్తాయి.

అంతే కాకుండా ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి.ఫస్ట్ హాఫ్ లో వచ్చే పలు ఆసక్తికర సీన్లకు వివేక్ సాగర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత ప్లస్ అయ్యిందని చెప్పాలి.అలాగే ఇదే ఫ్లో సెకండాఫ్ లో కూడా సాగుతుంది.విశ్వక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తన లైఫ్ లో ఏమయ్యింది అన్న విషయాన్ని షార్ట్ అండ్ స్వీట్ గా చూపించి ఏమాత్రం బోర్ అనిపించకుండా తెరకెక్కించిన విధానం బాగుంది.

అంతే కాకుండా ఊహించని విధమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమాను తెరకెక్కించడం మరో మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి.ఇక నటీనటుల విషయానికి వస్తే వస్తే విశ్వక్ ఈ చిత్రం ద్వారా తన నటనలోని ఈజ్ ను మరోసారి చూపించాడు.ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో కానీ కొన్ని అగ్రెసివ్ సీన్స్ లో కానీ విశ్వక్ పెర్ఫామెన్స్ చాలా బాగుంది.అలాగే హీరోయిన్ రుహాని శర్మ కూడా మంచి నటనను కనబర్చింది.ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి.అలాగే ఇతర పాత్రలలో కన్పించిన మురళీ శర్మ,బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రలను పర్ఫెక్ట్ గా పోషించారు.

ఇక దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాపై పెట్టిన ఎఫర్ట్స్ చాలా హర్షణీయం అని చెప్పాలి.క్రైమ్ జాన్రా సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఈ చిత్రం ఒక మంచి ఎక్స్ పీరెన్స్ ఇచ్చే విధంగా తెరకెక్కించిన విధానం బాగుంది.ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో మంచి రో కనబర్చారు.అలాగే మణికందకన్ అందించిన సినెమాటోగ్రఫి చాలా నాచురల్ గా రగ్గుడ్ లుక్ లో ఉండి సినిమా చూసే ప్రేక్షకుడిని మరింత లీనం అయ్యేలా చేస్తుంది.ఇక అలాగే వివేక్ సాగర్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రాణం అని చెప్పాలి.

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే విశ్వక్ మరియు శైలేష్ కాంబో లో నమోదైన మొదటి కేసు “హిట్” ట్రాక్ లోనే ఉందని చెప్పాలి.మొదటి నుంచి చివరి వరకు ఆధ్యంతం ఆసక్తికరంగా సాగే స్క్రీన్ ప్లే,అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు పలు ఇన్వెస్టిగేషన్ సీన్లు కథానుసారం వచ్చే ట్విస్టులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా పెద్దగా కమర్షియాలిటీ లేకపోవడం కాస్త మైనస్ అని చెప్పాలి.ఓవరాల్ గా మాత్రం విశ్వక్ మరియు శైలేష్ లు నిర్మాత నానికు బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి “హిట్” ఇచ్చారని చెప్పాలి.