ఇంట్లో ఉండే వీటిని క్లీన్ చేయకపోతే కచ్చితంగా జబ్బులు వస్తాయి..

ఇంట్లో ఉండే వీటిని క్లీన్ చేయకపోతే కచ్చితంగా జబ్బులు వస్తాయి..

ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఉదయం లేచిన దగ్గిర నుంచి రాత్రి పడుకునే వరకు మనం సెల్ ఫోన్ల తోనే రోజంతా గడిపేస్తాం. అయితే వాటివల్ల అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. సెల్ ఫోన్లు పరిశుభ్రత స్థాయిలలో అత్యంత దుర్భరమైనవని అనేక అధ్యయనాలు మరియు పరిశోధనలు నిరూపించాయి. అందువల్ల మన ఫోన్‌లను దాదాపు ప్రతిరోజూ శుభ్రం చేయాలి. లేదంటే వాటిపై ఉండే క్రిములు హానీ కలిగిస్తాయి. మనలో చాలా మంది ఫోన్లను బాత్రూంలోకి కూడా తీసుకెళ్లడం మరియు బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత చేతులు కడుకున్న తరువాత కూడా ఫోన్లను పట్టుకుంటాం. అందుకే మన ఫోన్లను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

మనలో అనేక మంది రెగ్యులర్ గ మేకప్ వేస్తుకుంటాం. దానికోసం మేకప్ బ్రష్ లను ఉపయోగిస్తాము. అయితే మేకప్ బ్రష్ లు చర్మ వ్యాధుల బాక్టీరియాకు నిలయం, ఆది మేకప్ అవశేషాల వల్ల అభివృద్ధి చెందుతుంది. మరియు అందువల్ల క్రమం తప్పకుండా వాటిని శుభ్రపరచడం అవసరం. మీ చర్మ ఆరోగ్యాంగా ఉండటానికి మీరు వారానికి ఒకసారైనా వాటిని శుభ్రం చేయాలి.