చేతులు కడిగేందుకు శానిటైజర్ వాడుతున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

ఉరుకుల పరుగుల జీవితంలో మనం అనేక విషయాలను మర్చిపోతుంటాం. అందులో ముఖ్యంగా చేతులు కడుక్కోవటం. రోజు మొత్తంలో మన చేతులు అపరిశుభ్ర ప్రదేశాలెన్నిటినో తాకుతూ ఉంటాయి. డబ్బులను లెక్కపెడతాం, డోర్‌ హ్యాండిల్స్‌ పట్టుకుంటాం, షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ ఉంటాం, ఒక్కోసారి చేయి అడ్డు పెట్టుకుని తుమ్మేస్తాం, దగ్గుతాం. ఇలాంటి పనులెన్నిటికో చేతులను ఉపయోగిస్తాం కాబట్టి సూక్ష్మక్రిముల నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌ ఉండాలి.

బిజీగా ఉన్న జీవితంలో అన్ని పనులు త్వరత్వరగా చేస్తుంటాం . ఫుడ్ కూడా త్వరత్వరగా తింటూ ఉంటాం. కానీ, కొన్నిసార్లు చేతులు శుభ్రం చేసుకోవడం మర్చిపోతుంటాం. కానీ, ఇలా చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే, ప్రతి రోజు మన చేతులో ఒక మిలియన్ క్రిములతో నిండిపోతాయి. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ వుంటాయి. అయితే, ఎప్పుడూ సబ్బు, నీటితో చేతులు కడుక్కోవడం సాధ్యం కాదు. కాబట్టి చాలా మంది శానిటైజర్స్‌ని వాడుతుంటారు. ఇందులో మద్యం ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌లను ఎప్పుడు వాడుతుంటారు. ఈ హ్యాండ్ శానిటైజర్లని వాడిన తరువాత నీరు అవసరం లేదు. సాధారణ సబ్బు, నీరు లేకుండానే.. చేతులని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చేతుల్లోని క్రిములు చాలా వరకు నశిస్తాయి. అందుకే ఇప్పుడు చాలా మంది శానిటైజర్స్‌ని ఉపయోగిస్తారు. వీటిని వాడడం వల్ల మరో ఉపయోగం ఏంటంటే.. తక్కువ సమయంలోనే వీటిని వాడొచ్చు. దీనికి నీరు కూడా అవసరం లేదు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరి వద్ద శానిటైజర్స్ ఉంటున్నాయి.