టూత్ పేస్ట్‌ని ఇలా మాత్రమే వాడాలి..

టీవీ ఆన్ చేయగానే చాలా హడావిడి చేసే యాడ్ మీకు గుర్తుండే ఉంటుంది. అదే మీ టూత్‌పేస్టులో ఉప్పు ఉందా.. అని.. ఇది టూత్‌ పేస్టు గురించి జరిగేది. అయితే, కేవలం టూత్‌ పేస్ట్ గురించి ఇంత అవసరమా అంటే.. అవసరమే.. నోటి శుభ్రత అనేది చాలా ముఖ్యం. అందుకే.. ప్రదొరోజూ ఉదయాన్నే ప్రతి ఒక్కరూ నోటిని శుభ్రం చేసుకుంటారు. అయితే, ప్రతి పనికి కొన్ని పద్ధతులు ఉన్నట్లు.. ఇలా నోటిని శుభ్రం చేసుకోవడానికి కూడా టిప్స్ పాటించాలి. ఇందులో ముఖ్యంగా పేస్టు ఎంత వాడాలనేది తెలుసుకోవాలి.

ఇప్పుడు కూడా మనం మరోసారి టీవీ యాడ్ గురించే మాట్లాడుకుందాం. టీవీల్లో టూత్ పేస్ట్ రాగానే అందులో బ్రష్‌‌పై పేస్టు ఓ తారు రోడ్డు వేసినట్టుగా వేస్తారు. కానీ, ఇంత పరిమాణంలో టూత్ పేస్టు వాడడం అస్సలు మంచిది కాదు.. ఇది ఆ టూత్‌ పేస్టు కవర్‌పై కూడా ఉంటుంది. కానీ, అది మనం గమనించాం.. టీవీల్లో చూపిస్తున్నారుగా అని మనం కూడా అంతే పరిమాణంలో వాడుతుంటాం..కానీ, ఇది ఎంతమాత్రం మంచిది కాదు.. ఎందుకంటే ఇందులోని గుణాలు పళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి అంత వాడకపోవడమే మంచిది.

నిజానికీ పంటి శుభ్రత అనేది చాలా ముఖ్యంది. దీని వల్ల మనం అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే కచ్చితంగా ప్రతి ఒక్కరూ చక్కగా పళ్లు తోముకోవాలి. అన్ని జాగ్రత్తలు పాటించాలి.