కరోనా వైరస్ ఎలా వస్తుంది.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు..

కరోనా వైరస్ ఎలా వస్తుంది.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు..

ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న కరోనా.. హైదరాబాద్‌లోనూ అడుగుపెట్టడంతో ప్రజలంతా అప్రమత్తమయ్యారు. దీని గురించి తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి గురించిన అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

కారణాలు..

కరొనా వైరస్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాలి.

* సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది.

* ఇది దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.

* శారీరక సంబంధం ఉంటే ఈ వైరస్ వ్యాపిస్తుంది. అదే విధంగా స్పర్శ, షేక్ హ్యాండ్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

* వైరస్ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా.. అనంతరం చేతులను శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా వ్యాపిస్తుంది.

* మలం ద్వారా తక్కువనే చెప్పాలి.

లక్షణాలు..
ఈ వ్యాధి సోకితే అందరికీ ఒకే విధమైన లక్షణాలు కనిపించవు. అవి వారివారి రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి.. కానీ సాధారణంగా కనిపించే లక్షణాలు మాత్రం ఇవే..

* జలుబు

*తలనొప్పి

* దగ్గు

* మోకాలి నొప్పులు

* జ్వరం

* పూర్తిగా అనారోగ్యం

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

* ఎప్పటికప్పుడూ చేతులను సబ్బునీటితో కడగాలి.

* చేతులను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు..

* అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.

* మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి..

* బయటి ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది.

* ఎప్పటికప్పుడు తాజాగా వండిన ఆహారమే తీసుకోవాలి.