ఇంట్లో ఫ్లవర్ వాజ్‌లు పెడుతున్నారా..

ఇంట్లో ఫ్లవర్ వాజ్‌లను పెట్టినప్పుడు వాటి అందం ఇంటికే మరింత అందాన్ని తీసుకొస్తాయి. అందుకే వాటిని పెడుతుంటారు. పెంచుతుంటారు. అలా పెంచినప్పుడు.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. కొంతమంది పూలను అలంకరించినప్పుడు వాటిని మాత్రమే పెడతారు. అలా కాకుండా.. వాటి మధ్యలో ఆకులని కూడా పెడితే బావుంటుంది. మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి మధ్యలో కొన్ని ఆకులు కూడా ఉండేలా చూసుకోండి.

ఇందులో ముఖ్యంగా.. ఫ్లవర్ వాజ్ అనేది చక్కగా ఉండేలా చూసుకోండి. అందుకే దానిని కూడా అట్రాక్టివ్‌గా ఉండేది చూసుకోండి. దీని వల్ల ఆ ఫ్లవర్ వాజ్ చూడ్డానికి కూడా మరింతగా అందంగా ఉంటుంది.

పెట్టే పువ్వులు కూడా విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరుపు, నేరేడు రంగు, ముదురు రంగు పూలను మధ్యలో ఉంచి అరవిరిసిన పువ్వులని చుట్టూరా పెట్టండి. దీని వల్ల చుట్టు పెట్టినవి కూడా విచ్చుకుంటాయి..

ఫ్లవర్ వాజ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. లేకపోతే అందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. కచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోవాలి. దీంతో పటు.. ఫ్లవర్ వాజ్‌లో పోసే నీటిలో కాస్త ఉప్పు కలపాలి. ఇలా చేయడం వల్ల పూలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.