ఈ లిక్విడ్ వేసి ఇంటిని తుడిస్తే వైరస్‌లన్నీ మాయం..

చైనాలో పుట్టి ప్రపంచమంతా పాకిన కరోనా వైరస్‌కి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విపత్తుని ఆపేందుకు ప్రభుత్వాలు ప్రజలని కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని లాక్‌డౌన్ విధించారు. దీనిని చాలా మంది పాటిస్తున్నారు. దీని వల్ల కరోనా వైరస్ నుంచి కాస్తైనా తమని తాము కాపాడుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే, ఇది ఒక్కటే సరిపోదు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇప్పుడు అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంటిని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే వ్యాధికారక వైరస్‌లు మనపై దాడి చేయవు. సాధారణంగా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికీ ఈజీగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఈ వైరస్ సోకిన వెంటనే వారిని వేరుగా ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అంతటా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇంటికే పరిమితం కావాలని చెబుతున్నారు. అయితే, ఇంట్లో మాత్రం ఉంటే వైరల్ సోకదా అంటే.. ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే శుభ్రత పాటించాలి. అదే ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.

ఎప్పటికప్పుడు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. క్లోరోక్స్ క్రిమిసంహారక ఉత్పత్తులతో ఉపరితలాలను తుడవడం చేస్తుండాలి. లైజాయిల్ క్రిమిసంహారక స్ప్రే, బ్లీచ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగిన లిక్విడ్స్ మీ ఇంటిని క్లీన్ చేస్తుండాలి. ఇలా చేస్తుండడం వల్ల మీ ఇంట్లోని చాలా వరకూ వైరస్‌లు దూరం అవుతాయి. సూక్ష్మక్రిములు నశిస్తాయి. అయితే, వీటిని ఎలా వాడాలంటే. మామూలుగా మీరు ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీటిలో వీటిని పోస్తుంటారు.. ఒక కప్పు నీటిలో మూడవ వంతు క్లోరిన్ బ్లీచ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తి తుడవాలి. అదే విధంగా 4 టేబుల్ స్పూన్స్ క్లోరిన్ బ్లీచ్ పావు వంతు నీటిలో కలపాలి.. ఈ నీటితో ఇంటిని క్లీన్ చేస్తుండాలి. ఇలా చేస్తుంటే చాలా వరకూ క్రిములు దూరం అవుతాయి. ఇల్లు కూడా శుభ్రపడుతుంది. వీటితో పాటు సబ్బు నీటిలో వెనిగర్ కూడా ఉపయోగించడం చాలా మంచిది. దీని వల్ల ఇంట్లోని చాలా వరకూ దూరమవ్వడమే కాకుండా.. ఇంట్లోని చాలా వరకూ దూరమవుతాయి. కాబట్టి ఇకనుంచి ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడు ఇలా చేయండి.. దీని వల్ల ఇల్లు మొత్తం క్లీన్ అవుతుంది.