ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోండిలా..

పగిలిన పాదాలు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. ఈ సమస్యతో నడిచేటప్పుడు తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది చర్మ ఆరోగ్యాన్ని చూసుకుంటారు. కానీ, పాదాలను పట్టించుకోరు. శరీరాన్ని పట్టించుకుని పాదాలను వదిలేస్తే పగుళ్లు ఏర్పడి కొన్నిసార్లు అవి ఇన్ఫెక్షన్‌గా మారే అవకాశం ఉంది. కాలంతో సంబంధం లేకుండా పాదాలకు పగుళ్ళు ఏర్పడతాయి. వేడి నీరు, అధిక స్క్రబ్, చెప్పులు పాదాలు పగలటానికి కారణమవుతాయి. పాదాలు పగలడం వల్ల నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది. మరియు అందవీహనంగా కనిపిస్తాయి.

పాదాల పగుళ్లకు అనేక కారణాలు ఉన్నాయి. డ్రై స్కిన్, ఎక్కువగా నడవడం, చెప్పులు లేకుండా నడవడం, పరుగెత్తడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పరిశుభ్రత పాటించకపోవడం వంటివి కూడా పాదాల పగుళ్లకు కారణమవుతాయి. అయితే ఈ పగిలిన పాదాలను ఎక్కువకాలం పట్టించుకోకపోతే, త్వరగా నయం చేసుకోకపోతే.. ఇతర సమస్యలకు కారణమవుతాయి. పాదాలు పగుళ్లు లేకుండా మృదువుగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మృదువైన పాదాలను కలిగి ఉండాలనుకుంటున్నారా? దీనికోసం మార్కెట్ లో లభించే ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల పాదాలకు నష్టం కలిగే అవకాశం ఉంది. అందుకే పగిలిన పాదాలకు రసాయన ఉత్పత్తుల కన్నా వంటగదిలో లభించే పదార్ధాలను ఉపయోగించి అద్భుతమైన పెడిక్యూర్ ను ఇంట్లోనే చేసుకోండి. దీంతో అందమైన , మృదువైన పాదాలను పొందండి.