బరువు పెరగకుండా ఉండాలంటే గార్డెన్‌లో ఇలా చేయండి..

బరువు పెరగకుండా ఉండాలంటే గార్డెన్‌లో ఇలా చేయండి..

గార్డెనింగ్.. ఇంట్లో ఉన్న తోటకి మంచి అందాన్ని తీసుకొచ్చే ఓ ప్రక్రియ. ఇది చేయడం మంచి ఎక్సర్‌సైజ్ అని చెప్పొచ్చు. దీని వల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఆనందంగా ఉంటారని చెబుతున్నారు. గార్డెనింగ్ చేయడం అంటే చెట్లకు నీరు పోసి.. కాయలు, పూలు కోస్తే సరిపోదు. అవి చక్కగా పెరిగేలా చూడాలి. ఇందుకోసం కలుపు మొక్కలు తీయడం, పాదులు తోడడం చెట్లకు నీరు సరిగ్గా చేరుతుందా లేదా చూడడం వంటివన్నీ చూడాలి. ఇలా చేస్తేనే మీరూ సరిగ్గా గార్డెనింగ్ చేసినట్లు. కాబట్టి ఇలా చేస్తుండండి. ఇలా చేయడం వల్ల శారీరకంగా కూడా ఎక్సర్‌సైజ్ అయినట్లు అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

కలుపు తీయడం అంటే తోటలో పెరిగిన కలుపు మొక్కలు, గడ్డిని తీయడం వంటివి చేయడం వంటివి చేయాలి. ఇలా చేస్తుంటే చెట్లు కూడా అందంగా, ఏపుగా పెరుగుతాయి. కాబట్టి ఇలా చెట్ల మధ్య ఉన్న కలుపును తీయండి. ఇలా చేయడం వల్ల చెట్లు కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి ఇలా చేయడం వల్ల చెట్లు బాగా పెరుగుతాయి. అదే విధంగా ఇది శారీరక శ్రమతో కూడుకున్న పని కాబట్టి ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. అందువల్ల కెలరీలు మరీ ఎక్కువై.. ఊబకాయం దరిచేరకుండా మంచి ఆరోగ్యం, అందమైన గార్డెన్ సొంతం చేసుకోవాలంటే కలుపు తొలగించాల్సిందే.